శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (11:27 IST)

జుట్టు రాలితే.. ఈ టిప్స్ పాటించండి..

జుట్టు రాలుతుందా? అయితే ఈ టిప్స్ పాటించండి. జుట్టుకుదుళ్లకు రోజుమార్చి రోజు ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం మరిచిపోకండి. రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుని పడుకునే ముందు తలకి పట్టించి.. వేళ్ళతో జుట్టులోపల మసా

జుట్టు రాలుతుందా? అయితే ఈ టిప్స్ పాటించండి. జుట్టుకుదుళ్లకు రోజుమార్చి రోజు ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం మరిచిపోకండి. రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుని పడుకునే ముందు తలకి పట్టించి.. వేళ్ళతో జుట్టులోపల మసాజ్ చేయాలి.

మరుసటి రోజు కుంకుడు లేదా షాంపులతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. హెయి‌ర్ ఫాల్ సమస్య కూడా వుండదు.  
 
అదే విధంగా గ్రీన్ టీ నీటిని తలకి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా వారానికి కనీసం మూడుసార్లైనా ఇలా చేస్తే.. గ్రీన్ టీలో వుండే యాంటీ యాక్సిడెంట్ల ద్వారా కుదుళ్లకు బలం చేకూరుతుంది. 
 
ఇక అరటి పండును రోజుకొకటి తీసుకుంటే జుట్టు రాలే సమస్య వుండదు. అరటిలో పొటాషియం, మెగ్నీషియం జుట్టుకు బలాన్నిస్తాయి. అలాగే అరటి గుజ్జును కేశాలను పట్టించి అర గంట తర్వాత కడిగేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది.