సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (15:13 IST)

మందార నూనెను కేశాలకు రాస్తే..?

నేటి తరుణంలో ఆహారానికి పెడుతున్న ఖర్చు కంటే సౌందర్యానికి పెడుతున్న ఖర్చే ఎక్కువగా ఉంది. ఇక జుట్టు సంరక్షణ కోసం మరింత ఖర్చే పెడుతున్నారు. అయితే సౌందర్యాన్ని కాపాదుకునేందుకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నప్పటికీ సహజంగా లభించే వాటిలో సౌందర్య పరిరక్షణ చేసుకోవడం చాలా సులభం. అంతేకాదు ఖర్చు కూడా తక్కువే. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం..
 
మందార ఆకులు, పువ్వులు కేశ సౌందర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మందార నూనెతో తలవెంట్రుకలకు చాలా సహాయపడుతుంది. మందార నూనెలో తేమ.. చర్మాన్ని, వెంట్రుకలను మృదువుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. మందార నూనెను కేశాలకు రాస్తే కేశాలు మరింతగా మెరిసి అందాన్ని, మెరుపుని ఇస్తుంది. ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు కూడా తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.
 
కేశాలు తెల్లబడకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేకాక దృఢంగా ఉండేందుకు ఈ నూనె ఎంతో దోహదపడుతుంది. చర్మంలో మృతుకణాలను తొలగిస్తుంది. పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మర్దన చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమంటే మందారం ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతుంది.