బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By జె
Last Updated : సోమవారం, 15 జూన్ 2020 (20:36 IST)

శరీరంలో నల్లటి వలయాలు పోవాలంటే..? (Video)

కనుముక్కు తీరు ఎంత చక్కగా ఉన్నా చర్మం అందంగా ఉంటేనే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని తేమ తగ్గిపోతుంటుంది. క్రమేపీ చర్మం మృదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా తయారవుతుంది. ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయస్సు వారికి కళ్ళ క్రింద నల్లని వలయాలు, ముడతలు వంటివి ఏర్పడి దిగులు పెడుతుంటాయి.
 
వీరి చర్మం కూడా బాగా పొడిగా ఉంటుంది. దీని వల్ల వయస్సు మరింత పైబడినట్లు కనిపిస్తారు. కళ్ళ కింద వలయాలు సాధారణంగా వంశపారపర్యంగా వస్తాయి. వీటిని లేజర్ చికిత్స ద్వారా పాక్షికంగా తగ్గించకోవచ్చు. ఈ చికిత్స తీసుకునే సమయంలో ముఖానికి ఎండ తగలకుండా జాగ్రత్త వహించాలి. 
 
రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా ఆల్మండ్ క్రీమ్‌ని కంటి చుట్టూ రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి.
 
నలభయ్యవ పడిలో చర్మం సాధారణంగా డ్రై అవుతుంది. ఈవెనింగ్ ప్రీమ్ రోజ్ ఆయిల్, యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి సప్లిమెంట్లను రోజూ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉదయం రెండు బాదం పప్పులను కొంచెం పాలలో నానబెట్టాలి. రాత్రి వాటిని మెత్తగా చేసి ఆ పేస్ట్‌ను కళ్ళ చుట్టూ రాస్తే బ్లాక్ సర్కిల్స్ తగ్గుతాయట.