మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (14:16 IST)

ఎండకు చర్మం కమిలిపోతుందా? అయితే ఇలా చేయండి...

చాలా మందికి వేసవి కాలంలో చర్మ సమస్యలు ఉత్పన్నమవుంటాయి. దీనికి కారణం.. శరీరం అధిక వేడిమిని తట్టుకోలేక పోవడంతో ఈ సమస్యలు వస్తుంటాయి. మరికొందరికి చర్మం కమిలిపోతుంది. ఇంకొందరికి శరీరమంతా చెమటకాయలు పుట్టుకొస్తాయి. మరోవైపు అధిక చమటతో రాషెస్‌ లాంటివి వస్తుంటాయి. 

వీటికి ఎన్ని మందులు వాడినా అవి తగ్గవు. ఇలాంటి సమస్యలకు ఒక్కటే పరిష్కారమార్గం ఉంది. అదే.. అలోవేరా. తెలుగులో కలబంద. నిత్యం మన ఇంటి ముందర ఉండే అలోవేరాతో చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడవచ్చు. మెరిసే అందమైన ఛాయను పొందవచ్చు. 

పొడిబారిపోయిన చర్మం ఉంటే కనుక అలోవెరాని మాయిశ్చరైజర్‌గా ఉపయోగించడం మంచిది. దీనివల్ల చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఇందుకోసం మార్కెట్‌లో లభ్యమయ్యే కంపెనీలకు చెందిన అలోవెరా క్రీమ్‌ని వాడొచ్చు. అలోవెరాని తీసుకుని అప్లై చేయడం వల్ల కూడా స్కిన్ హైడ్రేట్‌గా ఉంటుంది. వేసవిలో ఇది చర్మాన్ని బాగా కాపాడుతుంది.

ఈ కలంబ గుజ్జు కేవలం చర్మంపొడిబారకుండానే కాకుండా చర్మ సమస్యలు, దురదలు మంటలు వంటివి కలిగినపుడు మంచి ఉపశమనం పొందవచ్చు. అలోవెరాకు చల్లదనాన్ని ఇచ్చే గుణం అధికం. అందువల్ల దురదకలిగిన ప్రదేశంలో ఈ జెల్‌ను రాయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. మరీ ఎక్కువగా ఉంటే రాత్రి పూట అలోవెరా జెల్ ని రాసి ఉదయాన్నే చల్లని నీళ్ళ తో కడిగేయాలి. 

చర్మం పొడిబారిపోయినా, మంట వున్నా అలోవెరా గుజ్జు పూస్తే బాగా పనిచేస్తుంది. ఎస్‌పి‌ఎఫ్‌తో కలిపి అలోవెరాని రాసినట్లయితే అతినీలలోహిత కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలోవెరా కేవలం పొడిబారిపోయే చర్మం, దద్దుర్లు మంటలకి మాత్రమే కాదు. మంచి అందమైన చర్మాన్ని కూడా సొంతం చేస్తుంది. అలానే జుట్టుకు కూడా అలోవెరా చాలా మంచిది.