శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (12:43 IST)

#Dial1947ForAadhaar.. హెల్ఫ్ లైన్ నెంబర్ వచ్చేసిందిగా..!

ఆధార్‌లో మార్పుల కోసం ఇక హెల్ఫ్ లైన్ నెంబర్ వచ్చేసింది. ఆధార్‌లో ప్రతీ చిన్న పనికి ఆధార్ సెంటర్‌కు ఇక వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకా ఆధార్ హెల్ప్ లైన్ నెంబర్ కీ కాల్ చేసి మీ సందేహాలను తీర్చుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఎఐ) ఆధార్ సమస్యల పరిష్కారం కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్ 1947ని లాంఛ్ చేసింది. 
 
ఈ ఆధార్ హెల్ప్‌లైన్ వారమంతా అందుబాటులో ఉంటుంది. ఏజెంట్లు, సోమ, శనివారాలలో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆదివారం మాత్రం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ సేవకులు అందుబాటులో ఉంటారు. 
 
ఆధార్ హెల్ప్‌లైన్ 1947 ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ మరియు ఉర్దూ భాషలలో సేవలను అందిస్తుంది. మీకు నచ్చిన భాషలో సంభాషణ కోసం హెల్ప్‌లైన్ కీ కాల్ చేయవచ్చు. రోజూ లక్షన్నర కాల్స్ స్వీకరించే సామర్ధ్యం యూఐడీఏఐ కాల్ సెంటర్‌కు ఉంది. ఐవీఆర్ఎస్ సిస్టమ్ మాత్రం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.