మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 26 అక్టోబరు 2023 (23:25 IST)

‘ఫేసెస్ ఆఫ్ అమెజాన్’: వినియోగదారులకు ఆనందాన్ని అందిస్తున్న ఆయేషా హుడా

image
పండగలు ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తాయి. పండగ సీజన్ ప్రారంభం కావడంతో అమెజాన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, సహచరులు మరియు భాగస్వాములందరిలో ఉత్సాహభరితమైన మార్పు వస్తోంది. పండగ సీజన్ అయినా లేదా అంతకు మించి అయినా, అమెజోనియన్లు పని మరియు ఆనందాన్ని ఒకే విధంగా ఆస్వాదిస్తారు. అందరూ ఒకే లక్ష్యాన్ని సాధించడం కోసం: వినియోగదారుల కోసం ప్రత్యేకంగా మ్యాజిక్‌ను జోడిస్తారు. ప్రైమ్ వీడియో కోసం కంటెంట్ మార్కెటింగ్‌కు నాయకత్వం వహించే అయేషా హుడా ఈ ఉత్సాహానికి కేంద్రంగా ఉన్న అలాంటి అమెజోనియన్. పండుగల సీజన్‌లో కుటుంబాలు కలిసి ఆనందించగలిగే పలు భాషలు, శైలులలో విస్తృతమైన షోలు, సిరీస్‌లను వీక్షకులు యాక్సెస్ చేయగలరని నిర్ధారించుకునేందుకు ఆమె అవిశ్రాంతంగా కృషి చేస్తుంది.
 
ఎఫ్‌ఎంసిజి (FMCG) వినియోగదారు మార్కెటింగ్‌లో విస్తృతమైన నేపథ్యాన్ని కలిగిన, ఆయేషా ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు చక్కగా సిద్ధమైంది. ఏప్రిల్ 2022లో సంస్థలో చేరినప్పటి నుంచి అందించిన సహకారం అమెజాన్ వినియోగదారుల అవసరాలపై అమూల్యమైన ఇన్‌సైట్లను అందించింది.
 
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గురించి ఆయేషా మాట్లాడుతూ, “పండుగ సీజన్ అనేది ఇంట్లో మరియు పనిలో ఒక ఉత్తేజకరమైన సమయం. ఈ సీజన్ అంతా ఆనందాన్ని అందించడమే. పండుగ సీజన్‌లో ప్రతి ఒక్కరూ ఆనందించగలరని నిర్ధారిస్తూ, కళా ప్రక్రియలు, భాషల్లో విస్తరించిన వినోద శ్రేణితో వినియోగదారులను ఆనందాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది ఆస్పిరెంట్స్’, ‘అప్‌లోడ్ సీజన్ 3’ వంటి సిరీస్ నుంచి, ‘మస్త్ మే రెహ్నే కా’, ‘ది అదర్ జోయ్’ వంటి అమెజాన్ ఒరిజినల్ సినిమాలు, ‘పిఐ మీనా’ వంటి మనోహరమైన సిరీస్‌లు మరియు ‘టకేషీస్ క్యాజిల్’ భారతీయ రీబూట్ ‘ది బరియల్’ మరియు ‘ట్రాన్స్‌ఫార్మర్స్ - రైజ్ ఆఫ్ ది బీస్ట్స్’ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌లకు అమెజాన్ విభిన్న వినోదాలతో వేడుకలను ఘనంగా ఆచరించుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ పండుగ సమయంలో బ్లాక్‌ బస్టర్ సినిమాలు మరియు పలు భాషలైన- ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మరాఠీలలో షోలతో నిండిన మంచి విరామాన్ని అందిస్తూ, మేము దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
 
ఆమె అమెజాన్ సంస్కృతి, నాయకత్వపు సూత్రాలను చెప్పుకోదగిన వాగ్ధాటితో ఉదహరిస్తూ, ‘‘అమెజాన్‌లో, రోజువారీ నిర్ణయం తీసుకోవడం, ప్రాజెక్ట్ నిర్వహణలో మేము మా నాయకత్వ సూత్రాలను ఒక సమగ్ర అంశంగా కలిగి ఉన్నాము. నేను హృదయపూర్వకంగా స్వీకరించే నాయకత్వ సూత్రం కస్టమర్ అబ్సెషన్. ప్రతి నిర్ణయం నేను తయారు చేసుకున్న మరియు నేను నిర్వహించే ప్రతి ప్రాజెక్ట్, నేను దాని ప్రధానమైన వినియోగదారుని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని దానిని కఠినంగా అంచనా వేస్తాను’’ అని వివరించారు.