శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (16:40 IST)

వెస్పా ‘రేసింగ్‌ సిక్ట్సీస్‌’ను ఆవిష్కరించిన పియాజ్జియో ఇండియా

పియాజ్జియో ఇండియా నేడు క్లాసిక్‌ మరియు సౌందర్యపరంగా ఆకర్షణీయమైన, ప్రత్యేక ఎడిషన్‌ వెస్పా రేసింగ్‌ సిక్ట్సీస్‌ను 125 మరియు 150 సీసీ సామర్థ్యాలతో భారతదేశంలో ఆవిష్కరించింది. ప్రతిష్టాత్మక మరియు కాలాతీత వెస్పా, వేగం మరియు విజయం యొక్క అతి ముఖ్యమైన స్ఫూర్తితో నిండి ఉన్న 1960ల నాటి వాహనాలలో కనిపించే ధైర్యవంతమైన సరళత మరియు ప్రత్యేకతను కాంప్లిమెంట్‌ చేస్తుంది. ఈ నూతన వెస్పా స్పెషల్‌ సిరీస్‌ను సాంకేతికంగా అత్యాధునికమైన వెస్పా ఎస్‌ఎక్స్‌ఎల్‌ 150 బీఎస్‌6 మరియు ఎస్‌ఎక్స్‌ఎల్‌ 125 బీఎస్‌6 ఆధారంగా తీర్చిదిద్దారు. ఈ రేసింగ్‌ సిక్ట్సీస్‌ ఎడిషన్‌ను ఈ సంవత్సరారంభంలో గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020 వద్ద ఆవిష్కరించారు.
 
బ్రాండ్‌ వెస్పాతో అనుసంధానించబడిన ప్రతిష్టాత్మక హోదాను  వెస్పా రేసింగ్‌ సిక్ట్సీస్‌ వృద్ధి చేస్తుంది మరియు వివిధ సౌందర్య ఎంపికల ద్వారా ప్రతిబింబించే భావ ప్రకటనా స్వేచ్ఛను సూక్ష్మంగా మిళితం చేస్తుంది.  ఇది శక్తివంతమైన, తాజా మరియు ఆధునిక లుక్‌ కోసం ఆనాటి అంశాలను నేటి కాలంలో ఉంచడం ద్వారా సౌందర్య వ్యామోహాన్ని సృష్టించి రైడర్‌కు ఆ భేధాన్ని గుర్తించే అవకాశం అందిస్తుంది. రేసింగ్‌ సిక్ట్సీస్‌ యొక్క క్లాసిక్‌ మరియు ఘనమైన స్పోర్టీ అప్పీల్‌, 1960ల నాటి రేసింగ్‌ మెషీన్‌ల కలర్‌ థీమ్‌ను కాంప్లిమెంట్‌ చేస్తుంది.
 
ప్రిస్టిన్‌ వైట్‌ బాడీ కలర్‌పై రెడ్‌ గ్రాఫిక్స్‌తో ఓ చిన్న బంగారువర్ణం మరియు గోల్టెన్‌ 5 స్పోక్‌ అల్లాయ్‌ వీల్స్‌ ద్వారా ఇది ప్రదర్శితమవుతుంది. స్పష్టమైన గ్రాఫిక్‌ లైన్స్‌ ఇరువైపులనూ మరియు ఫ్రంట్‌ టైను మరింత ఆకర్షణీయంగా మలిస్తే, రియర్‌ వ్యూ మిర్రర్స్‌, గ్రాబ్‌ హ్యాండిల్‌ మరియు ఫుట్‌ రెస్ట్స్‌, ముందు మరియు వెనుక లైట్‌ అప్లీక్‌ మరియు మఫ్టర్‌ కవర్‌పైన ఉన్న మ్యాటీ బ్లాక్‌ ఫినీష్‌ వినూత్నమైన కాంట్రాస్ట్‌ అప్పీల్‌ను అందిస్తుంది.
 
వెస్పా రేసింగ్‌ సిక్ట్సీస్‌ సిరీస్‌కు స్ఫూర్తిని 1960ల నాటి జెంటిల్మన్‌ రైడర్స్‌ రేస్‌లనుంచి తీసుకున్నారు. వాహన కస్టమైజేషన్‌ విభాగానికి సంబంధించి తమలోని కళాత్మకను వ్యక్తీకరించుకున్న కాలమది. ఈ కాలం నాటి రైడర్లు స్వతంత్య్రం మరియు స్వయంప్రతిపత్తి స్ఫూర్తితో నిండి ఉండడంతో పాటుగా వారి జట్టును ఎంచుకోవడం, ఎక్కడ పోటీపడాలి వంటి అంశాలలో తమ ప్రత్యేకత చూపేవారు.
 
వారు ఎంచుకునే రంగులుమరియు గ్రాఫిక్స్‌ వంటివి తరచుగా వారి సొంత దేశాలను ప్రతిబింబించేవి. గ్రాఫిక్‌ డిటైల్స్‌ మరియు కలర్‌ స్కీమ్‌లు ఒకరి వ్యక్తిగత బృందాలకు భరోసా ఇవ్వడంతో పాటుగా వైవిధ్యమైన మరియు అతి సులభంగా గుర్తించతగిన లుక్‌ వంటివి బ్రాండ్స్‌కు వీక్షణ పరంగా నివాళిగా ఉంటూనే విజయపు మార్గంలో స్పోర్ట్స్‌ బృందాలకు మద్దతునందించే రీతిలో ఉండేవి.
 
వెస్పా రేసింగ్‌ సిక్ట్సీస్‌ స్పెషల్‌ సిరీస్‌లో అనుసరించిన శైలి, అలనాటి క్రీడాకారుల విజయాలను ప్రతిధ్వనిస్తుంది మరియు మొనాకో లేదా మాంజాగ్రాండ్‌ ప్రిక్స్‌ ట్రాక్స్‌ వంటి సర్క్యూట్స్‌ లేదా టార్గా ఫ్లోరియో లాంటి చారిత్రాత్మక చాంఫియన్‌షిప్‌ల జ్ఞాపకాల దొంతరలలోకి తీసుకువెళ్తాయి. ఆ కాలపు స్ఫూర్తిని తీసుకుంటూనే నోస్టాల్జియాను కనిష్టంగా ఉంచుతుంది. ఎందుకంటే వెస్పాకు మాత్రమే అది తెలుసు. తమ నూతన లివరీలతో, రేసింగ్‌ సిక్ట్సీస్‌ స్పెషల్‌ సిరీస్‌ క్లాసిక్‌ శైలిని స్పోర్ట్స్‌ ట్విస్ట్‌తో అందిస్తూనే, అలనాటి అందాలను ప్రతిబింబించేలా మెటీరియల్‌ మరియు టాక్టికల్‌ విలువలైనటువంటి రంగు, మెటీరియల్‌, టెక్చర్‌ను డిటైల్స్‌ పరంగా ఎక్స్‌క్లూజివిటీ టచ్‌తో పునరావిష్కరించారు.
 
రేసింగ్‌ ప్రపంచం యొక్క లివరీస్‌కు ఆవల, ఈ స్పెషల్‌ ఎడిషన్‌ వెస్పా రేసింగ్‌ సిక్ట్సీస్‌, సాంకేతికంగా అత్యాధునికమైన మోనోకోక్యు ఫుల్‌ స్టీల్‌ బాడీ, ప్రకాశవంతమైన హై డెఫినేషన్‌ 3 కోట్‌ బాడీ రంగులు, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ లేదా ట్విన్‌ పాట్‌ కాలిపర్‌ డిస్క్‌ బ్రేక్‌తో కంబైన్డ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్ వంటివి రైడర్‌కు ఫ్యాషనబుల్‌ మరియు సురక్షిత వాహనానికి భరోసా అందిస్తాయి.
 
ఈ నూతన అత్యున్నత పనితీరు కలిగిన బీఎస్‌6 ప్రమాణాలతో కూడిన ఇంజిన్‌, స్పష్టమైన ఉద్గారాలు, 3 వాల్వ్‌ డిజైన్‌ మరియు ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ సాంకేతికతతో సవారీ అనుభవాలను రేసింగ్‌ సిక్ట్సీస్‌ స్ఫూర్తికి సరిపోలే రీతిలో ఉంటాయి. మరింతగా ఎక్స్‌క్లూజివిటీని పొందేందుకు, ఈ రేసింగ్‌ సిక్ట్సీ్‌లో క్రిస్టల్‌ ఇల్యుమినేషన్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, సెంటర్‌ ఇంటిగ్రేటెడ్‌   డే టైమ్‌ రన్నింగ్‌ ఎక్స్‌ట్రా బ్రైట్‌ బీమ్‌ లైట్‌, యుఎస్‌బీ మొబైల్‌ చార్జింగ్‌ పోర్ట్‌ మరియు బూట్‌ లైట్‌ వంటివి రైడర్లకు శైలితో కూడిన సౌకర్యం అందిస్తాయి.
 
వెస్పా రేసింగ్‌ సిక్ట్సీస్‌ యొక్క ఉద్వేగపూరిత ఆవిష్కరణ గురించి శ్రీ డియాగో గ్రాఫీ, ఛైర్మన్‌ అండ్‌ ఎండీ, పియాజ్జియో ఇండియా మాట్లాడుతూ ‘‘ ప్రత్యేక ఎడిషన్‌ వెస్పా రేసింగ్‌ సిక్ట్సీస్‌ను పరిచయం చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. సుదీర్ఘమైన వారసత్వంతో ఓ ప్రతిష్టాత్మక బ్రాండ్‌గా వెస్పా స్ధిరంగా నూతన ధోరణులు ఏర్పరుస్తూ తమను తాము కనుగొంటూనే ఉంది. ఇది దీని వైవిధ్యతను ప్రదర్శిస్తూనే విభిన్నమైన సమయాలకు తగినట్లుగా వినూత్నమైన ప్రత్యేకతలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
 
వెస్పా రేసింగ్‌ సిక్ట్సీస్‌ అనేది 1960ల నాటి గోల్డెన్‌ రేసింగ్‌ యుగపు రేసింగ్‌ మెషీన్ల నేపథ్యాన్ని పునరావిష్కరించేందుకు అసాధారణ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ కాలపు స్ఫూర్తిని స్ఫురణకు తీసుకువస్తూ, ఇది వారసత్వాన్ని నేటి అత్యాధునిక సాంకేతికతతో మిళితం చేస్తుంది. వెస్పాను ప్రేమించేవిచక్షణ కలిగిన వినియోగదారులకు ఈ తరహా ప్రత్యేకతను అందిస్తున్న బ్రాండ్‌ ఇది’’ అని అన్నారు. వెస్పా రేసింగ్‌ సిక్ట్సీస్‌ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌లు వద్ద లభ్యమవుతాయి.