సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (16:50 IST)

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీ

ప్రభుత్వ చమురు రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1746 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ అప్రెంటీషిప్ పోస్టులే. వీటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ట్రేడ్‌ను అనుసరించి సంబంధింత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఐటీఈ, ఇంజనీరింగ్, డిగ్రీ, బీఏ, బీకాం, బీస్సీ, డిప్లొమోలలో ఉత్తీర్ణులై ఉండాలి. 
 
టెక్నీషియన్ అప్రెంటిస్, ఎలక్ట్రికల్ అప్రెంటిస్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానికల్, ట్రేడ్ అప్రెంటీస్, ఫిట్టర్, ట్రేడ్ అప్రెంటిస్, ఎలక్ట్రీషియన్స్, మెషినిస్టు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పోస్టులు ఉన్నాయి. 
 
అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 24 యేళ్ళకు మించి ఉండరాదు. ఆన్‌లైన్ టెస్ట్, మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఈ నెల 14వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.