బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 13 డిశెంబరు 2024 (23:31 IST)

తమ ప్రారంభ కెరీర్ ప్రోగ్రాం టెక్ బీ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన HCLTech

2023, 2024లో తమ 12వ తరగతిలో ఉత్తీర్ణమైన విద్యార్థులు, 2025లో తమ 12వ తరగతి ఉత్తీర్ణమయ్యే విద్యార్థులు ఈ వినూత్నమైన కార్యక్రమం కోసం అర్హులు. నోయిడా, భారతదేశం, డిసెంబర్ 2024- HCLTech, ప్రముఖ అంతర్జాతీ టెక్నాలజీ కంపెనీ, తమ టెక్ బీ ప్రోగ్రాం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రకటించింది, 12వ తరగతి తరువాత విద్యార్థులు తమ కెరీర్స్‌ను ప్రారంభించే అవకాశం కల్పించింది. భారతదేశంవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఈ ప్రోగ్రాం అందుబాటులో ఉంటుంది. 
 
ఎంపికైన అభ్యర్థులు HCLTechతో 12 నెలల శిక్షణ పొందుతారు. విజయవంతంగా పూర్తి చేసిన తరువాత, వారికి కంపెనీతో ఫుల్-టైమ్ ఉద్యోగాలు అందచేయబడతాయి. ప్రతిష్టాత్మకమైన సంస్థలైన BITS పిలాని, IIIT కొట్టాయం, SASTRA, అమిటీ యూనివర్శిటీ వంటి సంస్థల నుండి ఆన్ లైన్ ద్వారా పార్ట్‌టైమ్‌లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. 
 
గణితం లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్‌లో నేపధ్యం కలిగిన విద్యార్థులు టెక్నాలజీ బాధ్యతల కోసం దరఖాస్తు చేయడానికి అర్హులు. తమ ఎనిమిదవ ఏటలో భాగంగా దేశవ్యాప్తంగా డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్, డేటా సైన్స్, AI స్థానాల కోసం పాల్గొంటున్న విజయవంతులైన విద్యార్థులు టెక్ బీ ప్రోగ్రాంకి ఉన్నారు. అర్హమైన మార్కులు, ఆర్థిక సహాయం, కౌన్సిలింగ్ పై మరింత సమాచారం కోసం, సందర్శించండి.
 
“2017 నుండి, టెక్ బీ ప్రోగ్రాం వేలాదిమంది విద్యార్థులకు శిక్షణనిచ్చింది, వారు తమ చదువును కొనసాగిస్తూనే ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ కోసం ప్రాజెక్ట్ ల పైన పని చేయడానికి వారికి ఉద్యోగ నైపుణ్యాలు, అవకాశాలను అందిస్తోంది,” అని HCLTechకి చెందిన సుబ్బరామన్ బాలసుబ్రమణ్యన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు. ప్రాతనిధ్యంవహించబడని  నేపధ్యాలకు చెందిన విద్యార్థులకు అందుబాటులో ఉండటానికి, చేరికను నిర్థారించడానికి  HCLTech నేషనల్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(NSDC), భారతదేశంలోని వివిధ రాష్ట్రాల స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్స్‌తో భాగస్వామం చెందింది.