ఆదివారం, 15 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (15:48 IST)

Bima Sakhi Yojana Scheme: బీమా సఖీ యోచన.. మహిళలకు నెలకు రూ.7 వేలు చొప్పున స్టయిఫండ్

Bima Sakhi Yojana Scheme
Bima Sakhi Yojana Scheme
కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీతో కలిసి మహిళల కోసం కొత్త స్కీమ్‌ని తీసుకొచ్చింది. బీమా సఖీ యోచన పేరుతో డిసెంబర్ 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలు ఎల్ఐసీ ఉద్యోగం చేయవచ్చు. ఈ పథకం అవకాశాలను సృష్టించడమే కాకుండా దేశంలో వెనుకబడిన ప్రాంతాలలో బీమా సదుపాయాన్ని మెరుగుపరుస్తుంది. 
 
గ్రామీణ మహిళలకు బీమా ఏజెంట్లుగా మారడానికి, జీవనోపాధిని పొందవచ్చు. ఏడాదిలోపు 100,000 బీమా సఖీలను, మరో మూడేళ్లలో రెండు లక్షల మందిని చేర్చుకోవాలని భావిస్తోంది. ఈ పథకంలో చేరాలనుకునే మహిళలు కనీసం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఈ స్కీమ్ 18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల మహిళలకు మాత్రమే. ఈ స్కీమ్ వ్యవధి కేవలం మూడేళ్లు మాత్రమే. ఇందుకోసం ఎల్ఐసీ ఉచితంగా ట్రైనింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఎగ్జామ్‌లో పాసైతే ఏజెంట్ అయిపోయినట్టే.
 
తొలి ఏడాది ప్రతీ నెల రూ.7 వేలు చొప్పున స్టయిఫండ్ ఇస్తుంది. పాలసీలు కట్టించినా, కట్టించపోయినా ఈ మొత్తాన్ని మీ అకౌంట్లో వేస్తుంది. పాలసీలు కట్టిస్తే కమిషన్ కూడా వస్తుంది. రెండో ఏడాది కాస్త తగ్గుతుంది. 6 వేలు స్టయిఫండ్ ఇస్తుంది. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 5 వేలు రూపాయలు స్టయిఫండ్ ప్లస్ పాలసీలు కట్టిస్తే కమిషన్ కూడా వస్తుంది.
 
ఆధార్, ఎడ్యుకేషన్‌ సరిఫికెట్స్ (పది ఆపై  ఇంటర్, డిగ్రీ), అడ్రస్‌కు రేషన్ కార్డు చాలు. ఇవన్నీ తీసుకుని ఎల్ఐసీ ఆఫీసుకు వెళ్లవచ్చు. లేదంటే ఎల్ఐసీ సైట్లో నేరుగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక సహాయం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.