శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 జులై 2023 (23:09 IST)

స్ఫూర్తిదాయక కమ్యూనిటీ కనెక్ట్ సందర్శనను పూర్తి చేసిన ఐఎంటీ హైదరాబాద్ పీజీడీఎం బ్యాచ్ 2023-25

image
ఐఎంటీ హైదరాబాద్ లో 2023-25 విద్యా సంవత్సరానికి గానూ చేరిన పీజీడీఎం విద్యార్థులు తమ మేనేజ్‌మెంట్ ఓరియేంటేషన్ కార్యక్రమం “అభ్యుదయ్”లో భాగంగా పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా విద్యార్ధులు జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన సీఎస్ఆర్ విభాగం జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ను సందర్శించారు. విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించిన జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కార్యక్రమాలను గురించి విద్యార్ధులు తెలుసుకున్నారు. ఫౌండేషన్ ప్రారంభించిన వృత్తి విద్యా కోర్సుల వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో అడిగి తెలుసుకున్న వీరు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలో జాతీయ వృత్తి ప్రమాణాలను సైతం అధిగమించే రీతిలో ఇవి ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
 
ఇదే రీతిలో విద్యార్థులు స్వర్ణ భారత్ ట్రస్ట్ వద్ద నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం వీక్షించారు. పలు కార్పోరేట్ సంస్ధలతో ఈ ట్రస్ట్ భాగస్వామ్యం చేసుకుని తమ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే ఐఎంటీ విద్యార్ధులు బాలవికాస ఇంటర్నేషనల్ సెంటర్ (బీవీఐసీ)ను సైతం సందర్శించారు. నిరుపేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఈ సంస్ధ కట్టుబడి ఉంది. బీవీఐసీ కార్యక్రమాలైన వితంతువుల పునరావాసం, అనాధల సంరక్షణ, పశువుల కోసం ఆవాసాలు, నీటి శుద్ధి కేంద్రాలు వంటివి ఉన్నాయి. టెక్ మహీంద్రా ఫౌండేషన్ లో నైపుణ్య కేంద్రాలను కూడా విద్యార్ధులు వీక్షించారు. ఈ విద్యార్థులలో కొందరికి నిర్మాణ్ ఎన్‌జీవో నిర్వహిస్తున్న వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలను సైతం వీక్షించే అవకాశం దక్కింది.
 
ఈ కార్యక్రమాలు విద్యార్థులకు పలు అంశాల పట్ల అవగాహన మెరుగుపరుస్తాయని ఫార్మా పాఠశాల, గ్రాన్యూల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యామిని అన్నారు. ఈ సందర్శనలతో విద్యార్ధులకు లబ్ధిదారులను కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఐఎంటీ హైదరాబాద్ ఛైర్‌పర్సన్ (కమ్యూనిటీ కనెక్ట్) డాక్టర్ రోమినా మాథ్యూ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా వారు సైతం సమాజానికి తగిన తోడ్పాటునందించడానికి స్ఫూర్తి కలిగిస్తాయన్నారు.