ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2023 (22:02 IST)

రూ.200 కోట్ల స్కాలర్‌షిప్‌లను ప్రకటించిన ఫిజిక్స్ వాలా

image
భారతదేశంలో అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ యునికార్న్ ఎడ్-టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా (PW), తన ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్‌షిప్ కమ్ అడ్మిషన్ టెస్ట్ (PWNSAT 2023) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తుండగా, 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు, డ్రాపర్లకు, అలాగే జేఈఈ (JEE) లేదా నీట్ (NEET)కు సిద్ధం కావాలని కోరుకునే విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావచ్చు.
 
ఈ ఏడాది PWNSAT పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఫిజిక్స్ వాలా రూ.200 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లను అందించనుంది. విద్యార్థులకు అక్టోబర్ 2023, 1, 8 మరియు 15 తేదీలలో ఆఫ్‌లైన్ విధానంలో, అక్టోబరు 1 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు హాజరు కావాలని కోరుకునే విద్యార్థులు ఫిజిక్స్ వాలా (PW) వెబ్‌సైట్ మరియు యాప్ ద్వారా లేదా సమీపంలోని ఆఫ్‌లైన్ ఫిజిక్స్ వాలా (PW) సెంటర్‌లో ఇప్పటి నుంచి అక్టోబర్ 15, 2023 వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. పరీక్ష ఫలితాలు అక్టోబర్ 20, 2023న ప్రకటిస్తారు.
 
ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా విద్యార్థులు అనుభవజ్ఞులైన అధ్యాపకుల సహకారంతో విద్యాపీఠ్ కేంద్రాలలోనూ చదువుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాపీఠ్ కేంద్రాలలో విద్యార్థులు జేఈఈ/ నీట్ (JEE/NEET) కోసం నేర్చుకోవలసిన ప్రతి అంశాన్ని కవర్ చేసే సమగ్ర పాఠ్యాంశాలు నేర్చుకోవచ్చే. అలాగే, ఫిజిక్స్ వాలా స్థిరంగా అసాధారణమైన ఫలితాలను అందిస్తూ వస్తోంది.
 
అంకిత్ గుప్తా, సీఈఓ విద్యాపీఠ్ ఆఫ్‌లైన్, ఫిజిక్స్ వాలా (PW) మాట్లాడుతూ, ‘‘PWNSAT పరీక్ష మా ప్రతిభావంతులైన విద్యార్థి సముదాయానికి తిరిగి అందించేందుకు మరియు ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదవాలనే వారి కలలను సాధించడంలో సహాయపడింది. గత ఏడాది PWNSAT పరీక్ష భారీ విజయాన్ని సాధించింది. పరీక్షలకు 1.1 లక్షల మందికి పైగా విద్యార్థులకు మద్దతు అందించగా, రూ.120 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లు అందించాము. ప్రతి విద్యార్థి వారి ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను పొందేందుకు అర్హులని మేము విశ్వసిస్తున్నాము’’ అని తెలిపారు.
 
ఈ ఏడాది ఫిజిక్స్ వాలా PWNSAT పరీక్షకు ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ చదవాలనే వారి కలలను మరింత మంది విద్యార్థులు సాధించేందుకు PWNSAT పరీక్ష సహాయపడుతుందని సంస్థ విశ్వసిస్తోంది.