శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (16:11 IST)

పదో తరగతి ఉత్తర్ణతతో ఎంటీఎస్‌లో ఉద్యోగాలు

staff selection commission
పదో తరగతి ఉత్తీర్ణతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సి) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్), హవల్దార్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఎస్ఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు వచ్చే నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 12523 పోస్టులను భర్తీ చేపట్టనుంది. 
 
ఇందులో హవల్దార్, ఫ్యూన్, డ్రాఫ్టరీ, జమిందార్, జేటీవో, చౌకీదార్, సఫాయివాలా, మాలి వంటి పోస్టులు ఉన్నాయి., రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఈ పోస్టుల కోసం ఎంపిక చేస్తారు. 
 
అయితే, ఈ పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో ఎస్ఎస్సీ పలు మార్పులు చేసింది. ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను  270 మార్కులకు నిర్వహించనుంది. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. హవల్దార్ పోస్టులకు మాత్రం రాత పరీక్షతో పాటు దేహదారుఢ్య పరీక్ష కూడా ఉంటుంది. 
 
మొత్తం పోస్టులు - 12,523
ఎంటీఎస్ పోస్టులు - 11,994
హవల్దార్ పోస్టులు - 529
అర్హత - పదో తరగతి ఉత్తీర్ణత
వయస్సు - 18 నుంచి 27 యేళ్ల లోపు
ఎంపిక ప్రక్రియ - రాత పరీక్ష 
దరఖాస్తు విధానం - ఆన్‌లైన్
రిజిస్ట్రేషన్ ఫీజు - రూ.100
దరఖాస్తులకు చివరి తేదీ - ఫిబ్రవరి 19
పేపర్-1 అడ్మిట్ కార్డుల విడుదల - ఏప్రిల్ నెలలో
రాత పరీక్ష - ఏప్రిల్ నెలలో 
పూర్తి వివరాల కోసం .. www.ssc.nic.in