బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (15:05 IST)

2019లో టెక్ సంస్థల ద్వారా 40వేల అదనపు ఉద్యోగాలు

టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలు, ఈ-కామర్స్ దిగ్గజాలు కొత్త ఉద్యోగాల భర్తీకి సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే 2018లో ఉద్యోగ కల్పనలో టెక్ సంస్థలు 55 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. వ్యాపారాల విస్తరణల కోసం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్న సంస్థల సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా ఉద్యోగుల సంఖ్య 30 శాతం వరకు పెంచాలని సదరు సంస్థలు నిర్ణయించాయి. 
 
2019లో టెక్ సంస్థల ద్వారా 40వేల అదనపు ఉద్యోగాలు రానున్నాయని నాస్కామ్ ఉపాధ్యక్షుడు కె.ఎస్. విశ్వనాథన్ తెలిపారు. 2015తో పోలిస్తే.. టెక్క్ సంస్థలు ఈ ఏడాది రెట్టింపయ్యాయని ఆయన చెప్పారు. కార్స్‌ 24, మో ఎంగేజ్‌, ఇస్టామోజో, మిల్క్‌ బాస్కెట్‌, హెల్తియన్స్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించాయని సమాచారం. 
 
మిల్క్ బాస్కెట్ తమ ఉద్యోగుల సంఖ్యను మూడు వేలకు పెంచుకునేందుకు సిద్ధమవుతుండగా, హెల్తియన్స్‌ సంస్థ 150 మందిని, కార్స్‌24 సంస్థ 3 వేల మందిని ఉద్యోగాల నిమిత్తం ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది.