బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2023 (16:45 IST)

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన తెలంగాణ సర్కారు

exam
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ షెడ్యూల్ ప్రకారం 18వ తేదీ మొదటి లాంగ్వేజ్, 19న రెండో లాంగ్వజ్, 21వ తేదీన ఇంగ్లీష్, 26వ తేదీన సైన్స్ మొదటి పేపర్, 28వ తేదీన సైన్స్ రెండో పేపర్, 30వ తేదీన సోషల్ స్టడీస్, ఏప్రిల్ ఒకటో తేదీన ఒకేషనల్ కోర్సు వారికి సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్, 2వ తేదీన రెండో పేపర్ పరీక్షలు నిర్వహించేలా టెన్త్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. 
 
కొత్త సంవత్సరం రోజున ముంబై నగరాన్ని పేల్చేస్తాం : అంగతకుడి హెచ్చరిక.. హైఅలెర్ట్ 
 
కొత్త సంవత్సరం రోజైన జనవరి ఒకటో తేదీన ముంబై మహానగరాన్ని బాంబులతో పేల్చివేస్తామని ముంబై నగర పోలీసులకు ఓ అగంతకుడు ఫోనులో హెచ్చరించాడు. న్యూ ఇయర్ రోజున వరుస పేలుళ్లకు పాల్పడుతున్నట్టు హెచ్చరించాడు. ఈ మేరకు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోను చేశాడు. దీంతో ముంబై నగర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించిన పోలీసులు నగరాన్ని జల్లెడ పట్టారు. అయితే, ఇప్పటివరకు ఎక్కడా కూడా అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
time table
 
కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ అగంతకుడు శనివారం సాయంత్రం 6 గంటలకు ఫోను చేసి బెదిరించాడు. న్యూ ఇయర్ రోజున వరుస పేలుళ్లకు పాల్పడుతున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నగర వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.