ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. తారల ఫోటో గ్యాలెరీ
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 జులై 2024 (09:26 IST)

మిస్టర్ బచ్చన్ కు కలిసివచ్చిన ఐదు రోజుల లాంగ్ వీకెండ్‌

Raviteja new look
Raviteja new look
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' ప్రేక్షకులని అల్టిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఆగస్ట్ 19న (సోమవారం) రక్షా బంధన్ హాలీడేతో 5 రోజుల లాంగ్ వీకెండ్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ సినిమా ప్రీమియర్ షోలు ఆగస్ట్ 14న జరగనున్నాయి. రవితేజ స్లిక్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్‌ అదిరిపోయింది.
 
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నందున రెగ్యులర్ అప్ డేట్స్ తో వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ ఇటీవల ఫస్ట్ సింగిల్ సితార్‌ను విడుదల చేసారు. ఈ పాట క్లాసికల్, లవ్లీ కంపోజిషన్, బ్యూటీఫుల్ లోకేషన్స్, రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ మధ్య స్టీమీ రొమాన్స్ తో విశేషంగా అలరించి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ తర్వాత మిక్కీ జె మేయర్ మిస్టర్ బచ్చన్ కోసం హరీష్ శంకర్‌తో మళ్లీ జతకట్టారు.
 
జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ గ్రాండ్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్‌లైన్, అయాంక బోస్ సినిమాటోగ్రఫీ, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.