శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 నవంబరు 2019 (17:05 IST)

కంటికి మేలు చేసే క్యారెట్‌తో పిల్లలకు నచ్చే పూరీలు ఎలా?

కూరగాయల్లో క్యారెట్ శ్రేష్ఠమైంది. ఇది కంటికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే క్యారెట్లో ఎ, సి, కె, మిటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటిలోని ఎ విటమిన్ ఊపిరితిత్తులలో కఫం రాకుండా చేస్తుంది. వాటిలోని సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి తీసుకోవడం వలన జలుబూ, గొంతు నొప్పి లాంటి సాధరణ వ్యాధులు తొందరగా తగ్గుతాయి. 
 
క్యారెట్‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఎముకలు ధృడంగా మారుతాయి. కీళ్ల నొప్పుల నుంచి క్యారెట్ ఉపశమనం కలుగజేస్తుంది. రోజూ ఓ గ్లాసుడు క్యారెట్ జ్యూస్ తాగడం వలన కంటిచూపు మెరుగవుతుంది. దీంతో చర్మ సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. అలాంటి క్యారెట్‌తో పిల్లలకు నచ్చేలా పూరీలు తయారు చేయడం ఎలాగో చూద్దాం.. 
 
గోధుమపిండి : కప్పు
నూనె : తగినంత
ఉప్పు : తగినంత.
క్యారెట్ రసం : పావుకప్పు
బొంబాయి రవ్వ : రెండు చెంచాలు
 
తయారీ విధానం :
ఓ వెడల్పాటి బౌల్‌లో ముందుగా గోధుమపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు తీసుకోవాలి. క్యారెట్ రసం, నీళ్లు పోస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి. పావుగంట తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పిండిని పూరీల్లా ఒత్తుకొని రెండేసి చొప్పున నూనెలో దోరగా వేయించుకుంటే క్యారెట్ పూరీలు రెడీ అయినట్లే. ఈ పూరీలకు ఆలూ కరీ లేదా.. పనీర్ మష్రూప్ కర్రీ సూపర్ సైడిష్‌గా వుంటాయి.