బంగాళాదుంపని వేయించే ముందు మజ్జిగలో?
బంగాళాదుంపని వేయించే ముందు ముక్కలను మజ్జిగలో పది నిముషాలు ఉంచండి. చక్కగా వేగుతాయి. రుచిగా ఉంటాయి. కాకరకాయలు ఫ్రిజ్‌లో వుంచినా పండి పోతున్నాయా? వాటిని వీలైనంత చిన్నవిగా విరిచి నిలువ చేయండి. ఎక్కువ రోజు
అన్నం వంటేప్పుడు ముద్దగా అవుతున్నదా? ఉడికేప్పుడు చెంచా వంట నూనె వేస్తే పొడిపొడిగా వుంటుంది.
పెనానికి జిడ్డు బాగా పేరుకు పోయి ఎంతకూ వదలడం లేదా? పెనాన్ని వేడి నీళ్ళలో రెండు మూడు గంటలుంచి తర్వాత నిమ్మ చెక్కతో రుద్దండి.
ఫ్రూట్ సలాడ్ చాలా రోజుల వరకు నిలువ వుంచుకోవాలంటే దానిమీద అర కప్పు నిమ్మరసం చల్లండి. వాసన కూడా సూపర్‌గా వుంటుంది.
బంగాళాదుంపని వేయించే ముందు ముక్కలను మజ్జిగలో పది నిముషాలు ఉంచండి. చక్కగా వేగుతాయి. రుచిగా ఉంటాయి. కాకరకాయలు ఫ్రిజ్‌లో వుంచినా పండి పోతున్నాయా? వాటిని వీలైనంత చిన్నవిగా విరిచి నిలువ చేయండి. ఎక్కువ రోజులు నిలువ వుంటాయి.
డ్రై ఫ్రూట్స్ తో స్వీట్లు చేయాలనుకొన్నప్పుడు కాసేపు వాటిని ఫ్రిజ్‌లో ఉంచి తీసి, కొద్దిగా వేడి చేసిన కత్తితో కోయండి. సులువుగా కోయొచ్చు. ఫ్రిజ్‌లో పెట్టిన నిమ్మకాయను ఓ పది నిమిషాలు వేడి నీటిలో ఉంచి కోయండి. రసం బాగా వస్తుంది.