శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జులై 2020 (13:42 IST)

ఏపీ అసెంబ్లీలో కరోనా విజృంభణ.. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం విజ్ఞప్తి..

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నా.. ఏపీలో కరోనాతో రోజురోజుకు పరిస్థితి మరింత భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేపుతోంది. మూడు రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు కంగారు పెట్టిస్తోంది. సామాన్యులతో పాటు.. ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు కూడా కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. 
 
తాజాగా అసెంబ్లీలో పనిచేస్తున్న మరో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య 17కి చేరుకుంది. అసెంబ్లీలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 
 
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 31,148 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 5,041 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.