శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (11:53 IST)

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

pneumonia after corona
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా అధికమవుతున్న విషయం తెల్సిందే. గడిచిన 24 గంటల్లో 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,109 మందికి వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. గురువారం సంఖ్యతో పోల్చుకుంటే శుక్రవారం నాటికి 9 శాతం అధిక కేసులు నమోదైనట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా, ఢిల్లీ, మహారాష్ట్రలో వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీలో 1,527, మహారాష్ట్రలో 1,086 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 49,622 చేరింది. రికవరీ రేటు 98.70 శాతంగా నమోదైంది. 
 
కొత్తగా కేంద్రం 20 మరణాలను ప్రకటించింది. తాజాగా ఉద్ధృతికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని, కొవిడ్ నియమావళిని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.