బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 నవంబరు 2020 (16:23 IST)

కొవాగ్జిన్ ట్రయల్స్.. వచ్చే ఏడాది మార్చికి తర్వాత వ్యాక్సిన్

ఇండియాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ నుంచి బయటపడాలి అంటే పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాల్సి ఉంటుంది.

కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఇప్పటికే అలర్ట్ చేసింది. త్వరలో అందుబాటులోకి రాబోయే వ్యాక్సిన్‌ను పంపిణి చేయడం కోసం, స్టోరేజ్‌లను సిద్ధం చేసుకోవాలని కేంద్రం సూచింది. 
 
ఈ నేపథ్యంలో ఇండియాలో వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్న భారత్ బయోటెక్ ఓ సంచలన విషయం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి తరువాత వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం కేంద్రం మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చారు. 
 
ఈ నెలలో కొవాగ్జిన్ ట్రయల్స్ ప్రారంభం అవుతాయి. ట్రయల్స్‌ను పూర్తి చేసుకొని ఫలితాలు రావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. భద్రతాపరమైన అన్ని చర్యలు, అన్ని అనుమతులు వచ్చిన తరువాతే వ్యాక్సిన్‌ను రిలీజ్ చేస్తామని, దానికి సమయం పడుతుందని భారత్ బయోటెక్ ప్రకటించింది.