కోవిడ్-19 బారినపడిన వారిలో.. 12 వారాల కంటే...?
కోవిడ్-19 బారినపడిన వారిలో 23 శాతం మంది దీర్ఘకాలం ఇబ్బందిపడుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. వారిని 12 వారాల కంటే ఎక్కువకాలం పాటు వ్యాధి లక్షణాలు పీడిస్తున్నాయని వివరించింది. కొన్ని సూచికల ఆధారంగా ఇలాంటి వారిని ముందే గుర్తించవద్దని వెల్లడించింది.
సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. సాధారణంగా కోవిడ్ మూడు వారాల పాటు కొనసాగుతోంది. కొందరిలో మాత్రం 12 వారాలకూ ఈ వ్యాధి లక్షణాలు తగ్గవు.
దీన్ని లాంగ్ కోవిడ్ పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అమెరికాలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్ట్ నిర్వహించిన ఇంటర్నెట్ ఆధారిత సర్వేను శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు.