ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (10:12 IST)

మహారాష్ట్రను వణికిస్తోన్న కరోనా వైరస్-24 గంటల్లో 227 మంది మృతి

కరోనా వైరస్ మహారాష్ట్రను వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 7,924 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 227 మంది మృతిచెందారు. ఒక్కరోజులో 8,706 మందికి పైగా వ్యాధి నుంచి కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడం విశేషం. ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 3,83,723 కు పెరిగింది. 
 
కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా మొత్తం 13,883 మంది మృతిచెందారు. అయితే ముంబైలో కరోనా కారణంగా మృతిచెందినవారి సంఖ్య సోమవారం కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 129 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన పూణే డివిజన్‌లో గడచిన 24 గంటల్లో 52 మంది మృతి చెందారు. కరోనా నుంచి 2,354 మంది కోలుకున్నారు.