శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (21:15 IST)

భారత్‌లో సరికొత్త ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ : దీపావళి తర్వాత ప్రభంజనం?

omicron bf7 varient
దేశంలో మరో కొత్త ఒమిక్రాన్ ఓరియంట్ వెలుగు చూసింది. దీనికి బీఎఫ్ 7గా నామకరణం చేశారు. ఈ వైరస్ దీపావళి తర్వాత మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఈ వేరియంట్ ఇప్పటికే విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరించారు. ఈ వైరస్ రోగ నిరోధక శక్తని, వ్యాక్సిన్ల వల్ల ఇచ్చిన ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని వ్యాపిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తక్కువగానే ఉన్నాయని, కానీ, వృద్ధులు, పిల్లలు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరించారు. 
 
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో ఒమిక్రాన్ బీఏ 5.1.7 వేరియంట్‌తో పాటు అత్యంత విస్తరణ సమర్థ్యం కలిగిన బీఎఫ్ 7 వేరియంట్‌ను గుర్తించినట్టు బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ఈ యేడాది అక్టోబరు 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. 
 
ఈ యేడాది అక్టోబరు 11వ తేదీన గుర్తించిన ఈ వైరస్ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నట్టుగా తేలిందని నిపుణులు వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్లను ఒమిక్రాన్ స్పాన్ అని పిలుస్తున్నారని తెలిపారు.