శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (13:39 IST)

దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3614 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 8 లక్షల మందికి నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. అదేసమయంలో గత 24 గంటల్లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
శుక్రవారం వెల్లడైన ప్రకారం 255 మంది మృతి చెందగా, ఈ మరణాలు వందకు దిగువకు చేరుకున్నాయి. అలాగే, శుక్రవారం రిపోర్టు మేరకు 5185 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం దేశంలో మొత్తం 40,559 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 179,91,57,486 డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.