సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:39 IST)

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

corona visus
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 4,858 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు నమోదుకాగపోగా, ఈ వైరస్ నుంచి 4,735 మంది విముక్తులయ్యారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 48,028 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,39,62,664 మంది కోలుకున్నారు. మొత్తం 5,28,355 మంది కరోనాతో మృతి చెందారు. 
 
దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాలు రేతు మాత్రం 1.19 శాతంగా, క్రియాశీలక రేటు 0.11 శాతంగా ఉన్నట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,16,7,14,127 డోసుల కరోనా టీకాలను పంపిణీ చేశారు.