శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (13:46 IST)

కరోనాను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు.. టమోటా ధర రూ.100

కరోనాను కూరగాయల వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. తెలంగాణలో కూరగాయల వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. వీటిపై అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. 
 
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌, మోహదీ పట్నం రైతు బజార్‌ల్లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. టమాటా కిలో ధర నిన్నటి వరకు రూ. 8గా ఉంది. సోమవారం వ్యాపారులు కిలో రూ.100కి అమ్ముతున్నారు.
 
లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు మార్కెట్ల వెంటపడుతున్నారు. నిత్యావసర సరుకులు కొనుక్కుంటున్నారు. వారి హడావుడే ఆసరాగా వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు.  హైదరాబాద్‌లోనే కాదు నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ ఇటువంటి పరిస్థితులే వినియోగదారులకు ఎదురవుతున్నాయి.