శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (19:02 IST)

టీమిండియా గెలుపు కేరళ వరద బాధితులకు అంకితం... కోహ్లీ

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నామని చెప్పాడు. 
తన ఇన్నింగ్స్‌ను తన సతీమణి అనుష్కకు అంకితమిస్తున్నానని... ఆమె తనను ఎంతగానో ప్రోత్సహించిందని తెలిపాడు. తనలో స్ఫూర్తిని నింపిందని, తనను పాజిటివ్‌గా ఉంచే శక్తి ఆమెకు ఉందని కితాబిచ్చాడు. అన్ని విభాగాల్లో ఇంగ్లండ్ పై పైచేయి సాధించామని కోహ్లి వెల్లడించాడు. 
 
ఇది తమకు కంప్లీట్ టెస్ట్ మ్యాచ్ అని.. జట్టు సభ్యులు మెరుగైన ఆటతీరును ప్రదర్శించారని తెలిపాడు. బౌలర్లు మరోసారి 20 వికెట్లను పడగొట్టారని కితాబిచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మంచి ప్రదర్శనకు స్లిప్ క్యాచింగ్ తోడైతే... టెస్ట్ మ్యాచ్ గెలవడం ఖాయమని చెప్పాడు.