మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (17:11 IST)

నేనెప్పుడూ కపిల్ దేవ్ కావాలని అనుకోలేదు : హార్దిక్ పాండ్యా

తనను హర్యానా హరికేన్ కపిల్ దేవ్‌తో పోల్చినందుకు భారత పేసర్ హార్దిక్ పాండ్యా గట్టి కౌంటర్ ఇచ్చాడు. తానెప్పుడూ కపిల్ దేవ్‌లా కావాలని అనుకోలేదని స్పష్టం చేశాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా... క

తనను హర్యానా హరికేన్ కపిల్ దేవ్‌తో పోల్చినందుకు భారత పేసర్ హార్దిక్ పాండ్యా గట్టి కౌంటర్ ఇచ్చాడు. తానెప్పుడూ కపిల్ దేవ్‌లా కావాలని అనుకోలేదని స్పష్టం చేశాడు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా... కపిల్ దేవ్ అయ్యే అవకాశమే లేదని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్ వ్యాఖ్యానించాడు. దీనిపై హార్దిక్ పాండ్యా స్పందించాడు.
 
తనను తనగానే చూడాలి తప్ప.. ఎవరితోనూ పోల్చొద్దని కోరాడు. పైగా, తానెప్పుడూ కపిల్ దేవ్ కావాలని అనుకోలేదన్నాడు. 'నన్ను హార్దిక్ పాండ్యాగానే ఉండనివ్వండి. నేను పాండ్యాగానే బాగా ఆడుతా. నేను పాండ్యాగానే 41 వన్డేలు, పది టెస్టులు ఆడాను. కపిల్‌దేవ్‌లాగా కాదు' అని స్పష్టం చేశాడు.
 
పైగా, 'నాతో నా టీమ్ చాలా సంతోషంగా ఉంది. నాకు అంతకన్నా ఎక్కువ ఏమీ అవసరం లేదు' అని పాండ్యా చెప్పుకొచ్చాడు. తాను సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో పాండ్యా తర్వాతి కపిల్‌దేవ్ అని అనడం విన్నాను. ఇక ఎవరూ తనను మరొకరితో పోల్చొద్దని, తనను తనగానే గుర్తించాలని అతను స్పష్టంచేశాడు. 
 
కాగా, నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాండ్యా విజృంభించి 5 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కష్టాల్లో పడింది.