బుధవారం, 18 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

డెంగీ బారినపడిన శుభమన్ గిల్.. ఆఫ్ఘన్ మ్యాచ్‌కు కూడా దూరమే...

Subhman gill
భారత క్రికెటర్ శుభమన్ గిల్ ప్రస్తుతం డెంగీ జ్వరంబారినపడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ కారణంగా స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గత ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ఆప్ఘనిస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్‌లోనూ గిల్ అడబోవడం లేదని బీసీసీఐ వెల్లడించింది. తాజాగా గిల్ ఆరోగ్యంపై బీసీసీఐ అప్‌డేట్ ఇచ్చింది.
 
గిల్ ఇంకా కోలుకోలేదని వెల్లడించింది. చెన్నై నుంచి మంగళవారం భారత క్రికెట్టు బయలుదేరిందని, అయితే, గిల్ జట్టు వెంట వెళ్లడంలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఈ నెల 11వ తేదీన ఆప్ఘనిస్థాన్ జట్టుతో భారత్ ఆడే మ్యాచ్‌‍లోనూ గిల్ ఆడటం లేదని పేర్కొంది. కాగా, ప్రస్తుతం గిల్ చెన్నైలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.