శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 జనవరి 2023 (16:14 IST)

అట్టహాసంగా కేఎల్ రాహుల్- అథియా శెట్టి వివాహం?

KL Rahul
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అథియా శెట్టిల వివాహం ఈ ఏడాది జరుగనుంది. అతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె. కేఎల్ రాహుల్, అతియాల వివాహం జనవరి 21-23 మధ్య ముంబైలో జరుగుతుందని తెలుస్తోంది. రెండు కుటుంబాల సమ్మతంతో ఈ వేడుకను ఆడంబరంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. 
 
అథియా యూట్యూబ్‌లోని వ్లాగర్, ఆమె వీక్షకులతో వ్లాగ్‌ల ద్వారా ఫ్యాన్స్‌ను కమ్యూనికేట్ చేస్తుంది. హీరో (2015), మోతీచూర్ చక్నాచూర్ (2019), ముబారకన్ (2017), తడప్ వంటి చిత్రాలలో కథియా నటించింది. ఇక కేఎల్ రాహుల్ భారత జాతీయ జట్టుకు వైస్ కెప్టెన్ గానూ, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.