ఆప్ఘనిస్థాన్ అదరగొట్టింది.. టీ-20లో ప్రపంచ రికార్డ్.. ఎలా?
ఆఫ్ఘనిస్థాన్ జట్టు ట్వంటీ-20లో ప్రపంచ రికార్డు సృష్టించింది. డెహ్రాడూన్‌లో శనివారం ఐర్లాండ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. తద్వారా టి20 క్రికెట్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు పుటల్లోకెక్కింది.
ఆసీస్ 2016లో శ్రీలంకతో ఆడుతూ 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఇప్పటివరకు అదే అత్యధిక స్కోరు. ఇప్పుడు హజ్రతుల్లా జాజాయ్ అద్భుత బ్యాటింగ్ సాయంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది.
ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా బరిలో దిగిన జాజాయ్ కేవలం 62 బంతుల్లో 162 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 16 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ఉస్మాన్ ఘని (48 బంతుల్లో 73) కూడా ధాటిగా ఆడడంతో ఆఫ్ఘన్ రికార్డు స్కోరు నమోదు చేసింది.