సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2022 (17:16 IST)

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ విజేతగా ఇంగ్లండ్ - పాక్‌కు 'స్టోక్' షాక్

ben stokes
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ విశ్వవిజేతగా ఇంగ్లండ్ నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 138 పరుగులు మాత్రమే చేసింది. అదీ కూడా చచ్చీచెడి ఎనిమిది వికెట్లు కోల్పోయి ఆ మాత్రం పరుగులు చేసింది. దీనికి కారణం ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌‍తో బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. 
 
ముఖ్యంగా ఇంగ్లండ్ బౌలింగ్‌ను పాక్ బ్యాటర్లు ఏ దశలోనూ సమర్థంగా ఎదుర్కోలేక పోయారు. క్రమంగా తప్పకుండా వికెట్లు కోల్పోయింది. షాన్ మసూద్ (38), కెప్టెన్ బాబర్ అజామ్ (32), షాదాబ్ ఖాన్ (20)లు చొప్పున పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 3, అదిల్ రషీద్ 2, జోర్డాన్ 2, బెన్ స్టోక్స్ 1 చొప్పున వికెట్ తీశారు. 
 
ఆ తర్వాత 138 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు మరో ఓవర్ మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించి విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓపెరన్లు  బట్లర్ (26), హేల్స్ (1), సాల్ట్ (10), బెన్ స్టోక్స్ (52 నాటౌట్), బ్రూక్ (20), అలీ (19), లివింగస్టన్ (1) చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 9 పరుగులు వచ్చాయి. ఫలితంగా ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్లు తేడాతో విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్ జట్టును బెన్ స్టోక్స్ ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మెట్‌లో మరో అర్థ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.