శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (15:09 IST)

కివీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ కీలకం.. చివరకు బ్యాటింగ్ చేయాలి ... : చోప్రా

ఐసీసీ ట్వంటీ20 టోర్నీలోభాగంగా, ఆదివారం రాత్రి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ సన్నద్ధమయ్యాయి. పైగా, ఇరు జట్లూ ఆడిన తమతమ తొలి మ్యాచ్‌లలో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. 
 
ఇదిలావుంటే, ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన భారత్‌ మరింత పట్టుదలగా కనిపిస్తోంది. దీనిపై మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా మాట్లాడాడు. భారత జట్టులో ఎక్స్‌ ఫ్యాక్టర్‌ రిషభ్ పంత్‌ అని, అతను భారత ఇన్నింగ్స్ చివరి వరకూ బ్యాటింగ్ చేయాలని ఆకాశ్‌ అభిప్రాయపడ్డాడు.
 
‘పాండ్యా ఫామ్‌లో లేడు. అతను ఫామ్‌లోకి రావాలని మనమంతా కోరుకుంటున్నాం. కానీ డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్ చేయాలంటే పంత్‌ కన్నా బెటర్‌ ఆప్షన్ మరొకటి లేదు’ అని అతను చెప్పాడు.