శనివారం, 9 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (08:57 IST)

శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్ జట్లు ఇవే.. రెండు ఫార్మెట్లకు వేర్వేరు కెప్టెన్లు!!

suryakumar
భారత క్రికెట్ జట్టు ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో వన్డేలు, టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రెండు వేర్వేరు జట్లను ప్రటించి, రెండు ఫార్మెట్లకు ఇద్దరు కెప్టెన్లను ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత పొట్టి క్రికెట్ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో డ్యాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 జట్టు పగ్గాలను సెలెక్టర్లు అప్పగించారు. కొత్త కెప్టెన్‌గా సెలక్టర్లు సూర్యకి అవకాశం ఇచ్చారు. ఇక వైస్ కెప్టెన్‌గా శుభమన్ గిల్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చారు.
 
అయితే, 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌ కోసం ప్రకటించిన జట్టుకు మాత్రం కెప్టెన్‌గ రోహిత్ శర్మ వ్యవహరిస్తారు. జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కూడా చోటుదక్కింది. ఇక వన్డే జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ తిరిగి జట్టులోకి రావడం పెద్ద మార్పుగా కనిపిస్తోంది. ఈ జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
టీ20 జట్టు ఇదే
సూర్యకుమార్ (కెప్టన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్, మహ్మద్ సిరాజ్.
 
వన్డే జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాద్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.