ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024-షెడ్యూల్ విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 17వ సీజన్‌లో 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్-2024 పూర్తిగా భారత్‌లోనే జరగనున్నాయి.
మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ అనంతరం ఐపీఎల్-17 సీజన్ ఫుల్ షెడ్యూల్ వచ్చే అవకాశముంది.
మార్చి 22 నుంచి చెన్నై వేదికగా మొదలు కాబోయే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇంతవరకూ ట్రోఫీ గెలవని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుంది. మార్చి 23, 24, 31న డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.