రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. టీ-20 సిరీస్ నెగ్గిన టీమిండియా
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన సత్తా ఏంటో నిరూపించాడు. అరుదైన ఘనతను లిఖించుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీ-20 ట్రై సిరీస్ రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌ల్లో విండీస్ ఆటగాడు నెలకొల్పిన సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ బద్ధలు కొట్టాడు. ఇప్పటివరకు టీ 20ల్లో వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ మొత్తం 105 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచాడు.
కానీ రోహిత్ శర్మ సిరీస్‌కు ముందు క్రిస్ గేల్ రికార్డు బద్ధలు కొట్టేందుకు ఇంకా నాలుగు సిక్సర్ల దూరంలో వున్నాడు. కానీ తొలి మ్యాచ్‌లో సిక్సర్ బాదడంతో పాటు ఏకంగా 3 సిక్సర్లు బాదడంతో గేల్ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ 106 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే గేల్ వెనుక 103 సిక్సర్లతో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ ఉండటం విశేషం.
ఇకపోతే.. మరో మ్యాచ్ మిగిలివుండగానే విండీస్‌తో టీ-20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. వర్షం కారణంగా రద్దయిన రెండో టీ-20లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
ఓపెనర్ రోహిత్ శర్మ ఫోర్లు,సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. కోహ్లి 23 బంతుల్లో 1ఫోర్,1సిక్స్‌తో 28 పరుగులు చేసి ఫరవాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో థామస్,కాట్రెల్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. 167 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 15.3ఓవర్లలో విండీస్ స్కోరు 98/4 వద్ద వాతావరణం సహకరించకపోవడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజయం భారత్ సొంతమైంది. రెండు వికెట్లు తీసిన భారత బౌలర్ క్రునాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. విండీస్‌తో భారత్ మూడో టీ-20 ఈ నెల 6న గయానాలో జరగనుంది.