సిక్సర్లు సరే.. సొంత కారు అద్దాలనే పగులకొట్టుకుంటే ఎలా? (video)

Kevin O'Brien
సెల్వి| Last Updated: శుక్రవారం, 28 ఆగస్టు 2020 (19:27 IST)
Kevin O'Brien
క్రికెటర్లు సిక్సర్లు బాదితే ఆ బంతి ఎప్పుడో ఒకప్పుడు గ్రౌండ్ అవతలికి వెళ్లే సందర్భాలుంటాయి. అలాగే సిక్సర్ల మోత మోగించి పార్కింగ్‌లో ఉన్న కారు అద్దాల్ని బ్రేక్ చేసి ఉంటారు. కానీ తాజాగా ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓ బ్రియన్ మాత్రం తన కారు అద్దాల్ని తనే బ్రేక్ చేసుకున్నాడు.

ఐర్లాండ్‌లో జరుగుతున్న డొమెస్టిక్ క్రికెట్ టీ-20లో ఓ బ్రియన్ లిన్ స్టర్ టీమ్ తరపున ఆడుతున్నాడు. ప్రత్యర్థి నార్త్ వెస్ట్ వారియర్స్ టీమ్‌పై ఈ సందర్భంగా బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 37 బాల్స్‌లోనే 82 పరుగులు చేశాడు. మొత్తం 8 సిక్సులు బాదగా... అందులో ఒక సిక్సు గ్రౌండ్ దాటి బయటికి వెళ్లింది.

ఈ బాల్ తిన్నగా వెళ్లి బ్రెయిన్ కారు అద్దాలనే పగులకొట్టింది. దాంతో కారు వెనకవైపు గ్లాస్ ఇలా బ్రేక్ అయింది. అయితే ఈ విషయం కెవిన్‌కు తెలియదు. తీరా మ్యాచ్ మొత్తం ముగిసిన తరువాత ఇంటికి వెళ్దామని కారు దగ్గరికి వెళ్తే షాక్ అయ్యాడు.

విషయం తెలుసుకుని నవ్వి... దానిని రిపెయిర్ చేయించి ఇంటికి తీసుకెళ్లాడు. గతంలో ప్రాక్టిస్ సమయంలో కూడా భారీ సిక్స్ కొట్టిన కెవిన్ గ్రౌండ్‌కి దగ్గర పెట్టిన తన కారు అద్దాలను బ్రేక్ చేశాడు. అందుకే ఈసారి పార్కింగ్‌లో పెట్టాడట. కానీ ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయింది. కానీ కారు అద్దాల కోసం సిక్సులు కొట్టడం ఆపనని చెప్పుకొచ్చాడు.

దీనిపై మరింత చదవండి :