శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 ఏప్రియల్ 2025 (00:37 IST)

థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ విజయం

pbks  vs kkr
ఐపీఎల్ 2025 పోటీల్లో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 16 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఘోరంగా తడబడి 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బ్యాటర్లలో అంగ్ క్రిష్ రఘువంశీ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 
 
రహానే 17, అండ్రీ రస్సెల్ 17 చొప్పున పరుగులు చేశారు. సునాయాసంగా విజయం సాధించేలా కనిపించిన కేకేఆర్‌ను యజ్వేంద్ర చాహల్ కోలుకోలేని దెబ్బతీశాడు. నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీయగా, మార్కో యాన్సెన్ మూడు వికెట్లు నేలకూల్చాడు. మ్యాక్స్‌వెల్, అర్ష్ దీప్, బార్ట్‌లెట్‌లో తలో వికెట్ పడగొట్టారు. 
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభ్‌సిమ్రన్ 30, ప్రియాంశ్ 22 మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 3, వరుణ్ చక్రవర్తి 2, సునీల్ నరైన్ 2, నోకియా, వైభవ్‌లు తలో వికెట్ చొప్పున తీశారు.