మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (20:14 IST)

ట్వంటీ20 : భారత్ ఆశలు ఆవిరేనా? ఓపెనర్లు ఔట్

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం నరాలు తెగిపోయే ఉత్కంఠ భరిత మ్యాచ్‌ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం ఆరు పరుగులకే ఆరు పరుగులకే ఔట్ అయ్యారు. అలాగే, మూడో వికెట్ కూడా కోల్పోయింది. 
 
పాకిస్థాన్ బౌలర్ 21 ఏళ్ల పాక్ యువ పేసర్ షహీన్ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులతో రోహిత్ శర్మ (0), కేఎల్ రాహుల్ (3)లను అవుట్ చేయడంతో భారత శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది. అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికి స్కోరు కేవలం 6 పరుగులే. 
 
ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 వికెట్లకు 32 పరుగులు. క్రీజ్‌లో రిషబ్ పంత్ (1), విరాట్ కోహ్లీ (15 బ్యాటింగ్) ఉన్నారు. కాగా, రెండు వికెట్లు తీసిన షహీన్ అఫ్రిదిని సూర్యకుమార్, కోహ్లీ చెరో సిక్స్ బాదడం విశేషం. హాసన్ అలీ ఒక వికెట్ తీశాడు.