శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 జూన్ 2019 (14:01 IST)

రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్.. అయినా ఆడుతాడు.. ఎలా?

టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2011 ప్రపంచకప్‌ హీరోగా నిలిచినా.. గతకొంత కాలంగా జట్టులోకి ఎంపిక కాని విషయం తెలిసిందే. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్ సింగ్ బైబై చెప్పేయాలని భావించాడు. 
 
ఇందులో భాగంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. కాగా రిటైరయ్యాక.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
 
ఇకపోతే.. 2011 ప్రపంచకప్‌లో యువీ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కప్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2007 టీ20 ప్రపంచకప్‌ విజయంలోనూ యువరాజ్‌ తనదైన మార్క్ చూపించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కూడా వరల్డ్ కప్ సందర్భంగానే కొట్టాడు. 
 
అలాగే 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువీ.. 2017లో చివరి వన్డే, టీ20 ఆడాడు. ఇక ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. లీగ్ ఆరంభంలో జట్టులో చోటు సంపాదించిన యువీ.. పేలవ ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌కు బైబై చెప్పేశాడు.