ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (17:03 IST)

పాకిస్థాన్‌లో దారుణం - మతం మారాలంటూ హిందూ మహిళపై అత్యాచారం

rape victim
ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న పాకిస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, మైనార్టీలపై జరుగుతున్న ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా ఓ హిందూ మహిళపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. మతం మారాలంటూ ఒత్తిడి చేస్తూ ఈ దారుణానికి తెగబడ్డారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సింధ్ ప్రావిన్స్‌లో ఓ మహిళపై కొందరరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. మతం మారాలంటూ ఒత్తిడి చేశారు. దీనిపై ఆమె నిరాకరించడంతో నిర్బంధించి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు యధేచ్చగా ఈ దారుణం జరిగింది. ఆ తర్వాత ఆ కామాంధుల నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. 
 
"నన్ను ఇస్లాంలోకి మారాలంటా ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మోంగ్రియో, వారి సహచరులు బెదిరించారు. దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో వారు నన్ను కిడ్నాప్ చేశారు. మూడు రోజుల పాటు అత్యాచారం చేసారు. చివరికి వారి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలిపాను. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కనీసం వాళ్లు పట్టించుకోలేదు" అని బాధితురాలు ఆరోపించారు.