శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 నవంబరు 2023 (13:18 IST)

తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

suicide
తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూల్. ఈ విద్యా సంవత్సరంలోనే బాసర ట్రిపుల్ ఐటీలో చేరాడు.
 
ప్రవీణ్ కుమార్ హాస్టల్ బిల్డింగ్ లోని నాలుగో అంతస్తులో ఉరేసుకుని ఉన్న స్థితిలో కనిపించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఊరు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని, ఇవాళ ఉదయం 10 గంటలకు అవుట్ పాస్ తీసుకున్నాడని వైస్ ఛాన్సలర్ తెలిపారు.
 
తన గదిలో కాకుండా మరో గదిలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.