గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (14:13 IST)

చెన్నై యువతి నారయణవనం అడవుల్లో శవమై కనిపించింది..

తమిళనాడులో యువతి అదృశ్యం కేసు విషాదంగా ముగిసింది. నారాయణవనం కైలాసనాథకోన అడవిలో తమిళనాడుకు చెందిన తమిళ్ సెల్వి అనే యువతి మృతదేహాన్ని కనుగొన్నారు.  కట్నం కోసం వేధించి, అందుకు భార్య అంగీకరించిక పోవడంతో హత్య చేశాడు. ఆపై తప్పించుకోవాలని చూశాడు. తమిళ్‌సెల్వి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలోని పుళల్‌కు చెందిన తమిళ్‌సెల్వి(18) ఇంటర్‌ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది. చెన్నై రెడ్‌హిల్స్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న మదన్‌ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. మూడేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు.
 
కొంత కాలం పాటు సంసారం సజావుగా సాగింది. వరకట్నం తేవాలంటూ మదన్‌ తరచూ భార్యను వేధించేవాడు. ఈ నేపథ్యంలో జూన్‌ 25న తమిళ్‌సెల్విని తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని కైలాసనాథకోనకు తీసుకొచ్చాడు. కత్తితో పొడిచి హతమార్చాడు. అయితే చాలా కాలంగా కుమార్తె కనిపించకపోవడంతో తమిళ్‌సెల్వి తల్లిదండ్రులు బల్గిత్, మాణిక్యం రెడ్‌హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  విచారణలో భాగంగా మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో తమదైన శైలిలో విచారణ చేసి అరెస్ట్ చేశారు.
 
స్థానికుల సాయంతో గాలించగా అస్థిపంజర స్థితిలో తమిళ్‌సెల్వి మృతదేహం కనిపించింది. పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తామని నారాయణవనం ఎస్‌ఐ పరమేశ్‌నాయక్‌ తెలిపారు.