భార్య చనువుగా వుండలేదని.. ప్రియుడి ఇంటికి నిప్పంటించాడు..

fire
fire
సెల్వి| Last Updated: బుధవారం, 5 ఆగస్టు 2020 (15:44 IST)
వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ భర్త భార్య ప్రియుడి ఇంటికి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లిలో ఈ తరహా సంఘటన జరిగింది.

బెజ్జింకి మండలం ముత్తనపేటకు చెందిన ఓ వ్యక్తికి చిన్నకోడూరు మండలం చెల్కలపల్లికి చెందిన మహిళతో కొన్ని నెలల క్రితం పెళ్లి జరిగింది. కొని నెలల తర్వాత అతడు భార్యను చెల్కలపల్లిలోని పుట్టింట్లో వదిలేసి ఉపాధి కోసం ముంబైకి వెళ్లాడు.

ఆమె చెల్కలపల్లిలోని తన స్నేహితురాలి ఇంటికి తరచూ వెళ్లేది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆమె భర్త నెల రోజుల క్రితం తిరిగి వచ్చాడు. భార్య తనతో సరిగా ఉండడం లేదని అతడు అనుమానించడం మొదలు పెట్టాడు. స్నేహితురాలి తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించాడు. ఈ విషయమై ఆమెతో తరచూ గొడవపడే వాడు.

ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి చెల్కలపల్లికి వెళ్లి ఆ అనుమానిత వ్యక్తి ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు ఎగసి పడడంతో స్థానికులు అప్రమత్తమై ఆర్పేసారు. బాధితుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :