ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. ఫిఫా ప్రపంచ కప్ 2018
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (15:29 IST)

వేశ్యలతో ఆటగాళ్లు గడిపితే తప్పేంటి... పెద్దది చేయొద్దు... ప్లీజ్

ఫిఫా సాకర్ వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్లలో మెక్సికో ఒకటి. ఈ జట్టు ఆటగాళ్లు ఈ టోర్నీకి బయలుదేరి వెళ్లబోయే ముందు 9 మంది ఆటగాళ్లు, 30 మంది వేశ్యలతో పార్టీ చేసుకున్నారు. ఈ వ్యవహారం లీక్ కావడంతో తమ చర్యను మె

ఫిఫా సాకర్ వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్లలో మెక్సికో ఒకటి. ఈ జట్టు ఆటగాళ్లు ఈ టోర్నీకి బయలుదేరి వెళ్లబోయే ముందు 9 మంది ఆటగాళ్లు, 30 మంది వేశ్యలతో పార్టీ చేసుకున్నారు. ఈ వ్యవహారం లీక్ కావడంతో తమ చర్యను మెక్సికో జట్టు సమర్థించుకుంది.
 
టోర్నీ కోసం రష్యాకు బయలుదేరే ముందు తమ జట్టులోని 9 మంది ఆటగాళ్లకు వేశ్యలతో ఫేర్‌వెల్ ఫార్టీ ఇచ్చి విమర్శల పాలైంది. ఈ విషయాన్ని మెక్సికోకు చెందిన టీవీ నోటాస్ మ్యాగజైన్ బహిర్గతం చేయడంతో మెక్సికో ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎంఎఫ్‌ఏ)పై అభిమానులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. 
 
దీనిపై మెక్సికో ఫుట్‌బాల్ జట్టు అధికారులు స్పందించారు. దీన్ని వివాదాస్పదం చేయొద్దని మాత్రమే విజ్ఞప్తి చేశారు. క్రీడాకారులంతా క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌కు హాజరవుతున్నారు. వాళ్లకు లభించిన ఖాళీ సమయంలోనే ఏకాంతంగా గడిపారు. ఇందులో తప్పేమీ లేదు. కీలకమైన టోర్నీకి ముందుకాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపాలనే ఉద్దేశంతో ఇలా జరిగింది. కాబట్టి ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు ఉండవు అని ఎంఎఫ్‌ఏ పేర్కొంది. 
 
కాగా, వేశ్యలతో ఓ రాత్రంతా గడిపిన వారిలో గోల్‌కీపర్ గులెర్మో ఒకావో, స్ట్రయికర్ రూల్ జెమినెజ్, గెలాక్సీ బ్రదర్స్ జొనాథన్, గియోవని, డాస్ సాంటోస్, డిఫెండర్ కార్లోస్ సాల్కెడో, మిడ్‌ఫీల్డర్ ఫ్యాబియాన్‌లు ఉన్నారు. అయితే, ఈ వివాదంలో తలదూర్చని మెక్సికో జట్టు ఆటగాళ్లు కోపెన్‌హగన్‌కు బయలుదేరి వెళ్లిపోయారు. డెన్మార్క్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం కూడా సిద్ధమవుతుంది. మరోవైపు 2010లో మ్యాచ్ ముగిసిన వెంబడే అమ్మాయితో గడిపారనే కారణంగా ఇద్దరు ఆటగాళ్లపై సస్పెన్షన్ విధించిన విషయం తెల్సిందే.