శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 నవంబరు 2017 (13:12 IST)

స్వీట్‌కార్న్‌తో బరువు తగ్గుతారు.. చర్మం మెరిసిపోతుంది..

స్వీట్ కార్న్‌‌తో పాటు మామూలు మొక్కజొన్నలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. పసుపు రంగు మొక్కజొన్న ద్వారా కంటికీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో చర్మానికి అవసరమైన బీటా కెరోటిన్ సమృద్ధిగా వు

స్వీట్ కార్న్‌‌తో పాటు మామూలు మొక్కజొన్నలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. పసుపు రంగు మొక్కజొన్న ద్వారా కంటికీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో చర్మానికి అవసరమైన  బీటా కెరోటిన్ సమృద్ధిగా వుంటుంది. మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్‌, నియాసిన్‌ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి.
 
అలాగే గర్భిణులకు అవసరమైన ఫోలేట్‌ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువగా వుంది. ఇ-విటమిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. మొక్కజొన్నలో ఖనిజాల శాతమూ ఎక్కువే. ఫాస్ఫరస్‌ మూత్రపిండాల పనితీరుకి తోడ్పడితే, మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్సానర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. 
 
అంతేగాకుండా ఆల్జీమర్స్‌, మధుమేహం, బీపీ, హృద్రోగాలనూ నివారిస్తాయి. మొక్కజొన్న, స్వీట్ కార్న్‌ను ఉడికించి తీసుకోవడం ద్వారా శరీరానికియాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. కార్న్ నుంచి తీసే ఆయిల్ ద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బీపీని నియంత్రిస్తుంది. బరువు తగ్గుతారు. మొక్కజొన్న గింజలను అలాగే ఉడికించి తీసుకోవడం లేదంటే.. బంగళాదుంపలు చేర్చి వడల్లా చేసుకుని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
మొక్కజొన్న, దానిమ్మ గింజలు, కమలాపండు ముక్కల గింజలతో కాస్త నిమ్మరసం చేసి చాట్‌లా తీసుకుంటే బరువు తగ్గుతారు. మొక్కజొన్న జీర్ణకోశ సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో వుండే విటమిన్ సి చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.