ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (13:54 IST)

బరువు తగ్గాలంటే..? ఉదయం, సాయంత్రం కీరదోస జ్యూస్‍‌ను? (video)

బరువు తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించాలంటున్నారు.. పోషకాహార నిపుణులు. రోజూ పరగడుపున గుప్పెడు టమోటా ముక్కలు లేదా అర గ్లాసు టమోటా జ్యూస్ తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గుతారని వారు సూచిస్తున్నారు.

బరువు తగ్గాలంటే.. ఈ చిట్కాలు పాటించాలంటున్నారు.. పోషకాహార నిపుణులు. రోజూ పరగడుపున గుప్పెడు టమోటా ముక్కలు లేదా అర గ్లాసు టమోటా జ్యూస్ తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గుతారని వారు సూచిస్తున్నారు. అంతేగాకుండా.. ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు గ్లాసు కీరదోసకాయ రసం తాగితే పొట్టచుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది. 
 
వీటితో పాటు ఉదయం పూట నిద్రలేవగానే గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగాలి. ఇందులో కొద్దిగా తేనె కలుపుకుంటే ఇంకా మేలు. ఈ చిట్కాను ఆరు నెలల పాటు పాటిస్తే.. సులువుగా బరువు తగ్గుతారు. అంతేగాకుండా పరగడుపునే గోరువెచ్చని నీటిలో చెంచాడు అల్లం రసం కలుపుకొని తాగితే పొత్తికడుపు చుట్టూ అతిగా చేరిన కొవ్వు క్రమంగా కరుగుతుంది.
 
రోజూ అల్పాహారానికి ముందు నాలుగు చెంచాల పుదీనా ఆకుల రసం తాగితే పొట్ట కరగటమే గాక జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది. ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు రెండు స్పూన్ల కలబంద గుజ్జును గ్లాసుడు నీటిలో కలుపుకుని తాగితే బరువు తగ్గుతారు. భోజనానికి ముందు ఓ కప్పు పుచ్చకాయ ముక్కల్ని తీసుకుంటే.. ఒబిసిటీ దరిచేరదు. తద్వారా ఆహారాన్ని మితంగా తీసుకునే వీలుంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.