శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 31 ఆగస్టు 2023 (22:36 IST)

ఈ పండ్లను కలిపి ఒకేసారి తింటే అనారోగ్యం, ఏంటో తెలుసా?

fruits
కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల, కొన్ని పండ్లను ఇతర వాటితో తినకూడదు. అవేమిటో తెలుసుకుందాము.
క్యారెట్, నారింజలను కలిపి తినడం మంచిది కాదు, ఈ రెండింటిని కలిపి తింటే గుండెల్లో మంట, మూత్రపిండాలు దెబ్బతింటాయని చెపుతారు. బొప్పాయి, నిమ్మకాయ రెండూ కలిపి తింటే రక్తహీనత- హిమోగ్లోబిన్ అసమతుల్యతకు కారణమవుతాయి. ఇవి పిల్లలకు అత్యంత ప్రమాదకరమైనది.
 
పాలు, నారింజ రెండింటినీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా కష్టంగా ఉంటుంది, ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అరటికాయ, జామకాయ కలిపి తినడం వల్ల అసిడోసిస్, వికారం, గ్యాస్ ఏర్పడటం, నిరంతర తలనొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
 
పండ్లు, కూరగాయలను ఎప్పుడూ కలపకూడదు. పండ్లలో ఎక్కువ చక్కెర ఉంటుంది కనుక జీర్ణం కావడం కష్టం. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే సమ్మేళనం పాలతో కలిపి తింటే కడుపులో గ్యాస్, వికారం, ఇన్ఫెక్షన్లు, తలనొప్పి వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. అరటి, పుడ్డింగ్ కలయిక జీర్ణం చేయడం కష్టం. శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, ఇది పిల్లలకు ప్రమాదకరం.