మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (20:52 IST)

అలాంటి తిళ్లు వలన జీర్ణకోసం పొరలు పాడవుతాయ్....

ప్రతి ఒక్కరూ జీవించాలి అంటే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ తీసుకునే ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అనారోగ్యం వస్తుంది. అంతేగాక తీపి కలిగిన చిరుతిండ్ల వలన శరీర పోషణ కుంటుపడి పోగలదు. తీపిని అధికంగా సేవించటం వలన ఆ తీపి శరీర ఖనిజాలను, విటమిన్లను, పోషక శక్తి

ప్రతి ఒక్కరూ జీవించాలి అంటే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ తీసుకునే ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అనారోగ్యం వస్తుంది. అంతేగాక తీపి కలిగిన చిరుతిండ్ల వలన శరీర పోషణ కుంటుపడి పోగలదు. తీపిని అధికంగా సేవించటం వలన ఆ తీపి శరీర ఖనిజాలను, విటమిన్లను, పోషక శక్తిని హరించగలదు. ఇక కారం, మసాలా దినుసులు అధికంగా కలిగిన చిరుతిండ్లు తినడం వలన జీర్ణకోశంలోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణకోశం లోపల గల అరలను తినివేయగలదు. అందువలన కడుపులో మంట, నొప్పి, వాపు మెుదలగు ఉదర జీర్ణకోశ సంబంధమైన అనారోగ్యములు తలెత్తుతాయి. 
 
ఆహారం వేళాపాలా లేకుండా తీసుకోవడం వల్ల తిన్నఆహారం సరిగా జీర్ణంకాక కడుపులో అపానవాయువు చేరుట, బరువుగా నుండుట, గుండెలలో మంట, శరీర అలసట, మానసిక నిరుత్సాహం, అజీర్తి, విసుగుదల, నిద్రపట్టకపోవటం వంటి శారీరక, మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. సమగ్ర పౌష్టికాహారం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. క్రొవ్వు పదార్ధాలు, పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ పదార్ధాలు, నీరు... వీటిలో పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, క్రొవ్వుపదార్ధాలు మనిషి శరీరానికి అతి ముఖ్యమైనవి. 
 
నీరు, ఖనిజాలు, విటమిన్లు లాంటివి శరీరక్రమం సాఫీగా ఉండేటట్లు చేస్తుంటాయి. వీటిలో నీరు ప్రతి అవయవాన్ని సమర్ధవంతంగా పనిచేయటానికి  ఎంతగానో ఉపకరిస్తుంది. కార్బోహైడ్రేట్లలో జిగురు, పిండిపదార్ధము, చక్కెర ఉంటాయి. అంతేకాకుండా పండిన అరటిపండ్లు, చెరకు, పాలు, తేనె, మాంసములలో కూడా పిండిపదార్ధములు అధికంగా ఉంటాయి. ఈ పిండిపదార్ధముల వలన దేహానికి వేడి కలగటం, పనులు చెయ్యటానికి తగిన శక్తి లభిస్తుంది.